చిట్కాలు
12-Oct-2014
------------------------
మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే!
భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.
ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.
ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.
కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది.
ఒక క్యారెట్.. ఒక ఆలూ, ఒక ముల్లంగి ఇలా మిగిలిపోతుంటాయి. వీటినేం చెయ్యాలో తెలియక అలాగే ఎండబెట్టేస్తుంటాం. అలాంటప్పుడు అన్నిటినీ పప్పుతో పాటు కలిపి కిచిడి చేయవచ్చు.
బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కానీ, ఎండు మిరపకాయలు కానీ వేయాలి.
చర్మం టోనింగ్‌కి ఆరంజ్ జ్యూస్‌లోని విటమిన్ సి అద్భుతమైన టోనర్‌గా పనిచేస్తుంది. దీనిని ముఖంపై మర్దనా చేసినపుడు సబ్బుతో పోని అదనపు మలినాన్ని, మచ్చలను తలొగించవచ్చు. టోనర్ తయారీకి సగం ఆరంజ్, సంగం టీస్పూన్ నిమ్మరసం, ఒక క్వార్టర్ కప్పు నీటిని బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమం మృదువుగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. దూదిని దానిలో ముంచి ముఖంపై అప్లై చేయండి.
చర్మం సంరక్షణలో ఇది ఒక మంచి మూలిక. మొటిమలను నివారంచడంలో లావెండర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చర్మ ఛాయను బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి, లావెండర్ హెర్బ్‌ను నూరి పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ అవొకాడో పండును మెత్తగా పేస్ట్ చేసి కొద్దిగా పాలు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించడం ద్వారా మంచి కలర్ పొందవచ్చు. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరికాయలో కొబ్బరి తీశాం.. ఇక దీంతో పనేంటి..? పారేస్తే పోలా..? అనుకుంటున్నారా?... ఆగండి.. మీలోని సృజనాత్మకతకు పదునెడితే... ఆ కొబ్బరి చిప్ప అందరినీ ఆకట్టుకునే అందాలు, ఆకృతులతో వెలిగిపోతుంది. ఇదిగో... ఇక్కడున్నవి అలాంటివే.... మరి!
గుడ్డలోని తెల్లసొనలో చెంచా బాదం నూనె కలిపి ముఖం, మెడకు బాగా మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్ళతో కడిగేసుకుంటే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది
''పరిగెత్తే ముందు నడవడం నేర్చు కోండి'' అనేది ఈ మాటకు ఉన్న సాధారణ అర్థం. ఏదైనా ఒక పనిని తెలిసీ తెలియ కుండా చేయకూడదని, ఒక పనిలోని లోతుపాతులు లేదా ప్రాథమిక సూత్రా లు తెలుసుకున్నాకే అందులో ముందు కు సాగాలని ఈ సామెత అర్థం. ఉదా: ఒక వ్యాపారాన్నో లేదా రిపేరు వర్కునో చేయడానికి పూను కున్నప్పుడు ముందుగా దానిని 'ఎలా' చేయాలో మనకు తప్పక తెలిసి ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని వేడి పదార్థాలకు బదులు చలవ పదార్థాలు తింటే మంచిది.
మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్ పసుపు (టర్మరిక్)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి. మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్ పసుపు (టర్మరిక్)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.
రెండు నిండు చెంచాల తాజా తేనెను ఒక చెంచా ఆలివ్ నూనెతో కలిపి మృదువైన పేస్ట్ తయారు చేయండి. దానిని మీ జుట్టుపై మర్దన చేసి, జుట్టు కుదుళ్లతో ప్రారంభించి, జుట్టు చివర్ల వరకు చేయండి. తరువాత, ఈ మిశ్రమం మీ తలకు పట్టేటట్లు, షవర్ క్యాప్‌తో మీ జుట్టును చుట్టి ఉంచండి. 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని తొలగించడానికి సున్నితమైన హెర్చల్ షాంపూను వాడండి.
బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.
జున్ను పైన నీరు పారబోయకుండా పిండిలో కలుపుకోవచ్చు. కూరల్లోనూ వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది.
కాకరకాయ కూరలో పోపు గింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది
చలికాలంలో కానీ, ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన పచ్చికొబ్బరి చిప్పను తురిమి మిక్సీలో రుబ్బేటప్పుడు కానీ, కొంచెం గోరు వెచ్చని నీరు అందులో కలపడం వలన కొబ్బరికి అవసరమైనంత వేడి అందడమే కాదు త్వరగా రుబ్బడానికి కూడా కుదురుతుంది. పైన ఫ్యాట్ పేరుకుపోకుండా కూడా ఉంటుంది.
వంట చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఆ జాగ్రత్తలలో భాగంగా, వెల్లుల్లిని, యాలకులను డైరక్ట్‌గా నూనెలో వేయడం వలన అవి పగిలి నూనె మీదకి చిందే అవకాశం ఉంది. పొట్టు తీసి వేసుకుంటే మంచిది. లేక, అలా పొట్టుతోనే వేయాలనుకుంటే, కొద్దిగా నలగ్గొట్టి వేస్తే నూనె చిందే ప్రమాదం ఉండదు.
కొత్తిమీర ఆకుల రసం పెదాలపై రాసి, మర్దన చేస్తే అవి గులాబీ రంగుతో, మృదువుగా ఉంటాయి.
టమాటాలను ఏడెనిమిది నిమిషాలపాటు వేడినీళ్లలో ఉంచి తీస్తే తొక్క సులభంగా వస్తుంది.

ఆరోగ్యానికి సంబంధించినవి
నిత్య యవ్వనులుగా కనిపించాలంటే...!
సాధారణంగా కొంతమంది ఫేస్ ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చర్మం తేజోవంతంగా ప్రకాశిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళమెరుపుకు రహస్యం అర్థంకాక అనేక మంది యువతులు బాధపడుతుంటారు. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు. మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యాపిల్ : వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని చెపుతున్నారు. కనుక రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మ సౌందర్యం వస్తుందని చెపుతున్నారు. అలాగే, క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్ళకు ఏంతో మంచిదని చెపుతున్నారు. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయని వారు చెపుతున్నారు.
బీట్రూట్ : జ్యూస్ బీట్రూట్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటె పోతాయాట. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని చెపుతున్నారు.
టమోటా జ్యూస్: నిత్యయవ్వనులుగా కనిపించాలంటే టమోటా జ్యూస్, సూప్ వంటివి తీసుకుంటే చాలునని తాజా అధ్యయనంలో తేలింది. వయసు మీదపడటంతో ఏర్పడే ముడతలకు చెక్ పెట్టాలంటే టమోటా గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుందని అమెరికాలోని ఒక పరిశోధన సంస్థకు చెందిన నిపుణులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఎర్రని టమోటాల గుజ్జును ముఖానికి ప్యాక్ వేసుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా టమోటా జ్యూస్ తాగడం, వంటల్లో అధికంగా టమోటాలను చేర్చడంతో మహిళల అందం మరింత పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

- ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పని చేస్తుంది. బోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
- కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి.
- సోపు కూడా అజీర్తి సమస్యలకు, గ్యాస్‌కి చక్కగా పనిచేస్తుంది. అన్నం తినగానే ఒక టీస్పూను సొంపుని తినవచ్చు. లేదా మీరు మంచినీరు కాచి తాగేవారైతే ఆ నీటిలోనే సొంపుని వేసుకోవచ్చు.
- కడుపు ఉబ్బరం కారణంగా కడుపునొప్పి ఉన్నప్పుడు కొంచెం వాముని వేడి చేసి ఒక కప్పు నీటిని జోడించి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు లేదా పంచదారని కలిపి తాగాలి. కాస్త వాముని ఉప్పుతో కలిపి నమిలినా అజీర్తి ఉపశమనంగా పనిచేస్తుంది.
- పసుపు జీర్ణవ్యస్థలో సమస్యలను తగ్గించగలుగుతుంది. అరుగుదలకు మందుగా పని చేస్తుంది.
- మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
- పాలల్లో కాస్త పసుపు కలిపి కాచుకొని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జలుబుతో ముక్కు కారుతున్నప్పుడూ పసుపు కొమ్ముని కాల్చి ఆ వాసనని పీల్చాలి.
- తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి.
- తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
- తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
- దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి.
- లవంగాల పొడికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనెని కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
- లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
- కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.
- దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
- యాలుకలు వేసిన టీ సువాసన భరితంగా రుచిగా ఉంటుంది. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి.
- ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
- కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది.
- క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది.
- పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల అరుగుదల, పొట్టలో పురుగులు నశించటం, శరీరంలోని విష పదార్ధాలు నశించటం, కొలెస్ట్రాల్ నియంత్రణ, తక్కువ స్థాయిలో ఉన్న విరేచనాలు తగ్గుతాయి.
- కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.
- పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
- విరేచనాలు అవుతున్నప్పుడు మెంతిపొడిని ఒక అరకప్పు నీటితో కలిపి పొద్దున్నే తాగాలి. ఈ పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
- నీటిలో మెంతులు వేసి చేసిన టీ తాగితే కడుపులో మంట తగ్గుతుంది.
- అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకొని తాగితే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.
- ప్రతి రోజు అల్లంతో చేసిన టీని తాగుతుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట మొదలైన పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
- మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
- కడుపు నొప్పిగా ఉండి, నొప్పి ఎందుకు వస్తుందో అర్ధం కానపుడు కొంచెం జీలకర్రని తీసుకుని వేడి చేయండి. ఇఫ్ఫుడు వాటికి ఒక కప్పు నీటిని చేర్చి నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఈ నీటిలో రెండు మూడు చుక్కలు నెయ్యిని వేసి తాగండి. అది గ్యాస్ వల్ల వచ్చిన కడుపు నొప్పి అయితే తగ్గుతుంది. నొప్పి ఇంకా ఉంటే మాత్రం డాక్టరుని సంప్రదించాలి.
- ఒక చిటికెడు మిరియాల పొడిని మజ్జిగలో వేసుకొని ప్రతి రోజు తాగుతుంటే అరుగుదల క్రమబద్దం అవుతుంది.
- మిరియాలతో దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే మందుని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానె తాగండి. దీనిని సేవించడం వల్ల పైన చెప్పిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- తాగే నీటిలో సాజీరాను వేసి పది నిముషాల పాటు వేడి చేసి తాగితే పొట్టలో నులి పురుగులు, చెడు శ్వాస సమస్యలు తగ్గుతాయి.
- తులసి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
- వేడి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే జలుబు భారం తగ్గుతుంది.
- తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్యానికి
సంబంధించి చాలా సూత్రాలున్నాయి. కాని జీవితాంతం పాటించే సూత్రాలే నిజమైన
ఆరోగ్యసూత్రాలు. జీవితాంతం పాటించే నియమాలను మాత్రమే మీరు సంకల్పించుకోండి.
రేపటినుండి ప్రతిరోజూ 10 కిలోమీటర్లు నడక సాగించాలని సంకల్పం చేసుకోకండి.
ఎందుకంటే పది కిలోమీటర్ల నడక ప్రతిరోజూ చేయడమనేది అసాధ్యం. కాబట్టి
సాధ్యమయ్యే పనులు, సూత్రాలను మాత్రమే పాటించడానికి ప్రయత్నించండి. రోజుకు 1
కిలోమీటరు నడక సాగిస్తామని సంకల్పం చేసుకుంటే ఇది సాధ్యమవుతుంది. దీంతో
నడక ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రతి
రోజూ 1 కిలోమీటరు నడక ప్రారంభించి 10 కిలోమీటర్లకు చేరుకోవచ్చు. కాబట్టి
మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో, దానికి తగ్గట్టే నడకను ప్రారంభించండి.
అలాగే బరువులు ఎత్తడం, వ్యాయామం చేయడంలోకూడా ఇలాంటి పద్ధతినే పాటించండి.
వ్యాయామం ప్రారంభించిన తొలినాళ్ళలో అధిక బరువును ఎత్తడంకూడా మంచి పద్దతి
కాదు. కాబట్టి తేలిక బరువులను ఎత్తడానికి ప్రయత్నించండి. దీంతో ప్రతిరోజూ
అలవాటు పడితే శరీరానికి అలసట ఉండదు.
చలికాలం
పూర్తయ్యింది. నూతన సంవత్సరం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలుకూడా బలహీన
పడుతున్నాయి. ప్రతి సంవత్సరం 31 డిసెంబరు నాటికి ఆరోగ్యంపై తీసుకునే
నిర్ణయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నూతన సంవత్సరంలో రెండు నెలలు గడిచిన
తర్వాత తాము తీసుకున్న సంకల్పాలను మరచిపోతుంటాము. అతి కాస్త మార్పుకు
చోటుండే సంకల్పాలు చేయండి. వాటిని అమలు చేయడంకూడా చాలా సులభమౌతుంది.
** నీళ్ళు త్రాగండి : నీరు
మీ శరీరంలో ఓ ముఖ్యమైన తత్వం. మీ శరీర బరువులో దాదాపు 60శాతం నీళ్ళు
ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగానికి నీరు చాలా అవసరం. ప్రతి మనిషికి రోజుకు
1.5 లీటర్ల నీరు అవసరమౌతుందంటున్నారు వైద్యులు.
** ఉప్పు వాడకం తగ్గించండి : అత్యధికంగా
ఉప్పు ఉండే పదార్థాలు ఉదాహరణకు ఊరగాయ, అప్పడం, చట్నీలాంటివాటిని తక్కువగా
ఉపయోగించండి. ప్రతి రోజూ 5 గ్రాములకు మించి ఉప్పును వాడకూడదంటున్నారు
వైద్యులు.
** తాజా కూరగాయలు, పండ్లు అత్యధికంగా తీసుకోండి.
** మీ శరీర బరువును నియంత్రించండి : మీ
వయసుకు తగ్గట్టు మీ శరీర బరువు ఉండాలి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. శరీర
బరువు అధికంగా ఉంటే రోగాలకు పుట్టినిల్లు అవుతుంది అంటున్నారు వైద్యులు.
దీంతో మధుమేహం, హృద్రోగాలు అధికమౌతాయంటున్నారు వారు. మీ శరీర బరువు సాధారణం
కన్నాకూడా అధికంగా ఉంటే నిదానంగా ఆహారపు అలవాట్లను తగ్గించుకోండి. కాని
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. వాటికి సంబంధించిన సలహాలను
వైద్యులనుంచి పొందుతూ..వాటిని అమలు చేయడానికి ప్రయత్నించాలంటున్నారు
వైద్యులు.
** బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ శాతాన్ని తరచూ పరీక్షించుకోండి : అధిక
రక్తపోటు వలన గుండెపోటుకు గురౌతున్నారు చాలామంది. లేదా గుండె జబ్బులబారిన
పడుతున్నారు. ప్రతి రోజూ బ్లడ్ ప్రెషర్‌ను చెక్ చేసుకుంటుండాలి. కాస్త
మార్పు కనపడితే దానికి వైద్యుల సలహాలు తీసకోవాలి. రక్తపోటు తక్కువగా ఉంటే
గుండెపై తీవ్రమైన ఒత్తిడి కూడా తగ్గుతుందంటున్నారు వైద్యులు.
** శారీరకంగా ఆరోగ్యంగా ఉండండి : వ్యాయామం
చేయడంతో శరీరంలో బలం పెరుగుతుంది. హృదయంతోబాటు శరీరంలోని ఇతర అంగాలు
పటిష్టంగా ఉంటాయి. మెలమెల్లగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో మీలో
ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెరుగుతుంది. వ్యాయామం కొరకు రకరకాల ఏరోబిక్స్‌లను
పాటించండి. ఈత కొట్టడం, సైకిలింగ్, నడకలాంటివి చేస్తే ఆరోగ్యంగా
ఉండగలరంటున్నారు వైద్యులు.
** ధూమపానం విడనాడండి : ధూమపానం
వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. వ్యాయమం చేయాలనే ఆలోచనకూడా దరిదాపులకు
రాదు. దీంతో ధూమపానంతో ఆరోగ్యం చాలా వరకు పాడవుతుందని వైద్యులు
సూచిస్తున్నారు. ఈ ఉపాయాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించమని
ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అద్భుత ఆరోగ్యాన్నిచ్చే పుదీనా ఆకులు!

జోరున
వర్షం పడుతోందా? చలికాలం పడకపైనుండి లేవాలనిపించటంలేదా? ఒక కప్పు పుదీనా
చాయ్ తాగండి. పుదీనా ఆకులు ఇచ్చే సువాసనలు, ఘాటు, రుచి మీలోని బద్ధకాన్నంతా
ఒక్కపెట్టున వదిలించేస్తాయి.
ఎంతో
ఆనందంగా భావిస్తారు. పుదీనా ఆకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన కాలంనుండి
ఎంతోమంది ప్రజలు ఒక ఔషధంగా వాడుతున్నారు. పుదీనాలో అనేక రకాలున్నాయి. ప్రతి
రకం పుదీనాకి ఒకో రకమైన మంచి రుచి, వాసనలున్నాయి. మన ఇండ్లలో చేసుకునే
అనేక వంటకాలకు రుచి, వాసన, దాని ఔషధ ప్రయోజనాలకు గాను పుదీనాను చేరుస్తాము.
చిరుతిండ్లు, పండ్ల రసాల, సలాడ్లు, ఏవైనా సరే పుదీనా ఆకు పడాల్సిందే.
పుదీనా
ఆకులను వంటకాలలో ప్రధాన సుగంధంగా భారతీయులు, మధ్య ప్రాచ్చ దేశాలవారు
అధికంగా వాడతారు. రుచికరమైన పెరుగుకు పుదీనా జోడించి తింటారు లేదా వీరు
తాగే టీని పుదీనా ఆకులు వేసి తయారు చేసి తాగుతారు. పుదీనా చాయ్ మనదేశంలోని
కొన్ని ప్రాంతాలలో బాగా పేరుపడింది. ధాయ్ వంటకాలలో దీనిని సూప్ లలోను ఇతర
కూరలలోను వాడతారు. యూరప్ దేశాలలోని పుదీనా మొక్క కంటే ఆసియా దేశపు పుదీనా
మొక్క మంచి వాసన, రుచి కలిగి వుంటాయి.
పుదీనా ఆకు ప్రయోజనాలు పరిశీలిస్తే...
- పొట్ట నొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది.
- పుదీనా చాయ్ తాగితే, మలబద్ధకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడతాయి.
- పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడతాయి.
- పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది.
- పుదీనా ఆకులను పేస్ట్ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడు శ్వాస నివారించబడుతుంది.
- పుదీనా శరీర రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది.
ఇన్ని ప్రయోజనాలున్న పుదీనా ఆకు ఆరోగ్యం బాగుండాలంటే తప్పక మన వంటకాలలో చేర్చాలి.
ఇలాంటివి మీకు తెలిసినవి మాకు ఇమెయిల్ చేయండి మేము మీ తరుపున మన బ్లాగు నందు ఉంచెదము.
మా Email Id : kasanuryouth@gmail.com
ఇలాంటివి మీకు తెలిసినవి మాకు ఇమెయిల్ చేయండి మేము మీ తరుపున మన బ్లాగు నందు ఉంచెదము.
మా Email Id : kasanuryouth@gmail.com
alage padisam pattinappudu telavaya miriyalu konni and uppu gaddalu 2 anni kalipi tini padukunte jalubhu tagguthundhi
ReplyDelete