1 Feb 2016

ఫిబ్రవరి కబుర్లు

29-Feb-2016
----------------------


28-Feb-2016
----------------------
ఇవాళ వీర ప్రతాప్ రెడ్డి వివాహం భానుకోటలో జరిగినది..

27-Feb-2016
----------------------
ఇవాళ ఇవాళ సూర్యనారాయణ వివాహం భానుకోటలో జరిగినది.

25-Feb-2016
----------------------

ఒక శుభవార్త:
కార్డు చెల్లింపులకు అదనపు ఛార్జీలుండవ్‌ , సర్‌ఛార్జి, సేవారుసుం రద్దు : కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
గదు లావాదేవీలు తగ్గించి, క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు - ఆన్‌లైన్‌/మొబైల్‌ చెల్లింపులు, నగదు బదిలీ సేవలను ప్రోత్సహించే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులకు సర్‌ఛార్జి, సేవారుసుం (సర్వీస్‌ఛార్జీ)లను పరిహరిస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇందువల్ల కొనుగోలుదార్లు, విక్రయదార్లకు కూడా మేలు కలుగుతుంది. భారీమొత్తం నగదు లావాదేవీల్లో భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయి. డిజిటల్‌ చెల్లింపుల్లో ఈ బెడద ఉండదు. ఒక పరిమితికి మించిన చెల్లింపును కేవలం కార్డు లేదా ఆన్‌లైన్‌లోనే తప్పనిసరిగా జరపాలన్న ప్రతిపాదనను మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. వీటిల్లో పలు నిర్ణయాలను స్వల్పకాలం (ఏడాది లోపు), మరికొన్ని మధ్యకాలం (రెండేళ్లలోపు) అమలు చేయాల్సి ఉంది. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు వీటిని అమలు చేయాల్సి ఉంటుంది.
నగదు లావాదేవీలను సాధ్యమైనంత తగ్గించే యత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. అధీకృత చెల్లింపు వ్యవస్థలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెస్తోంది.
కార్డు/ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించడం అంటే వీటిద్వారా జరిగే చెల్లింపులపై సర్‌ఛార్జి, సేవారుసుం, సౌలభ్యరుసుం (కన్వీనియెంట్‌ ఫీ) రద్దు చేయడమే. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ సంస్థలు కూడా కార్డు/ఆన్‌లైన్‌ చెల్లింపులకు రుసుం వసూలు చేస్తున్న సంగతి విదితమే.
కార్డు/ఆన్‌లైన్‌ లావాదేవీల వల్ల ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు పన్ను ఎగవేతలు తగ్గేందుకు ఉపకరిస్తాయి. ప్రభుత్వ చెల్లింపులు, జమలు కూడా నగదు రహితంగా మారతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లింపు జరిగితే, కార్డు జారీ చేసిన బ్యాంకుతో పాటు, నగదు పొందిన ఖాతాదారు బ్యాంకుకు కూడా లావాదేవీలో కొంతశాతం రుసుం (మర్చంట్‌ డిస్కౌంట్‌రేట్‌-ఎండీఆర్‌) చేరుతుంది. ఈ మొత్తాన్ని తగ్గించాలని నిర్ణయించారు.
మొబైల్‌ బ్యాంకింగ్‌కూ ప్రోత్సాహం: సెల్‌ఫోన్‌ ఆధారంగా జరిగే మొబైల్‌ బ్యాంకింగ్‌కు ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలకు టెలికాం సేవారుసుంను క్రమబద్దీకరించనన్నారు.
మోసపూరిత లావాదేవీలపై సత్వర స్పందనకు..: ఆన్‌లైన్‌లో చేసుకునే మోసపూరిత ఆర్థిక లావాదేవీలను తగ్గించేందుకు, ఖాతాదారులకు భరోసా కల్పించే వ్యవస్థలను నెలకొల్పనున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు ఈ వ్యవస్థలు వేగంగా స్పందిస్తాయి.

 ఇప్పటికే చేపట్టిన ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ పేమెంట్‌, నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌), రియల్‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ (ఆర్‌టీజీఎస్‌) పద్ధతులు సౌకర్యవంతంగా ఉన్నా, అన్ని వర్గాల వారికి ఇంకా చేరువ కావాల్సి ఉంది. మొదటి, రెండో అంచె నగరాలలో బ్యాంకింగ్‌ సేవలు వినియోగిస్తున్న వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

24-Feb-2016
----------------------


15-Feb-2016
----------------------
ఈరోజు భానుకోట శివయ్య స్వామి ఆధ్వర్యంలో కసనూరు లో శనిగల సేకరణ జరిగింది. చాలా మంది రైతులు తమవంతు సాయంగా శనగలు విరాళంగా ఇచ్చారు.

14-Feb-2016
---------------------
ఈ సంవత్సరం చాలా మంది రైతులు తమ శనగలను దొండ్లవాగు గాడౌన్ కి తరలించారు. మరి కొంతమంది జమ్మలమడుగు గాడౌన్ కి తరలించారు. కొద్ది మంది మాత్రమే అమ్మడం జరిగింది. ఎందుకంటే శనగలు ధర 6 వేల రూపాయల వరకు పెరుగుతుందని ఆశిస్తున్నారు.

13-Feb-2016
--------------------
అందరు శనగలు మీసను ఆడిస్తున్న కారణంగా ఊరంతా దుమ్ము నిందుకుంది.

11-Feb-2016
--------------------


10-Feb-2016
--------------------

09-Feb-2016
--------------------



ఇవాళ మనీసారు వర్దంతి. ఆయన కుటుంబ సబ్యులు మన ఊరి పాఠశాల లో వర్ధంతి ని జరిపారు. విద్యార్థులకి స్వీట్స్ పంపిణీ చేశారు. ఇది మనీసారు యొక్క 20 వ వర్ధంతి.
05-Feb-2016
--------------------


03-Feb-2016
--------------------

02-Feb-2016
---------------------



01-Feb-2016
-----------------