2 Feb 2014

ఫిబ్రవరి కబుర్లు

18-Feb-2014
----------------

కసనూరు కి అనుకూలం గా ఉన్న రైల్వే స్టేషన్ కొండాపురం. సింహాద్రిపురం నుండి 12 రూ. చార్జీ. మన ఊరి ప్రజలు హైద్రాబాద్,చెన్నై,తిరుపతి,పూణే మరియు ముంబై తదితర నగరాలకు ఇక్కడి నుంచే వెళ్తారు.
13-Feb-2014
----------------
ఈ సంవత్సరం వోటర్ లిస్టు నుండి 138 వోట్లను తొలగించారు. సవరించిన వోటర్ల జాబితా కోసం ఇక్కడ నొక్కండి.
10-Feb-2014
----------------

 దాదాపు పొలాలన్నీ ఖాళీ అయ్యాయి. అప్పుడే ఎండాకాలం వచినట్లు ఉంది. మార్చి నుంచి జూన్ చివరి వరకు సింహాద్రిపురం నుంచి తాడిపత్రి దాకా ఎడారి లాగా ఉంటుంది.
09-Feb-2014
-----------------
 నీలవేణి పెళ్లి ఫోటోలు

 ఈ రోజు మన ఊర్లో రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. గడ్డం సాంబుని బిడ్డ నీలవేణి పెళ్లి నిడివెళగల లో జరిగింది. మరియు చింతమానోళ్ల రామేశ బిడ్డ ధరణి పెళ్లి జమ్మలమడుగు దగ్గర వేపరాల లో జరిగింది.

04-Feb-2014
-----------------
 నిన్న వారం లో సింహాద్రిపురం నుంచి కసనూరు మరియు కసనూరు నుంచి అగ్రహారం రోడ్డు కి పైన తారు వేశారు. ఇప్పుడు చాలా బాగుంది కొత్త రోడ్డు లాగా ఉంది. కానీ మన ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడం భాదాకరం. చుట్టు పక్కల ఊళ్లతో పోలిస్తే మన ఊర్లో మౌలిక సదుపాయాలు చాలా బాగున్నాయి. రోడ్డ్లు, వీధి లైట్లు, తాగు నీరు వంటి సదుపాయాలు చాలా బాగున్నాయి.





02-Feb-2014
-----------------
శంకర కొడుకు శివ ప్రసాద్ రెడ్డి వివాహం ఈ రోజు నిడివెళగల ఆంజనేయ స్వామి గుడి లో జరిగింది.
01-Feb-2014
----------------
శనగలు రేటు చాలా తక్కువగా ఉన్నాయి 2800 నుంచి 2900 ఉన్నాయి. అందువల్ల చాలా మంది రైతులు శనగలను జమ్మలమడుగు వేర్‌హౌస్ కి తరలించారు.