6 Jan 2014

జనవరి కబుర్లు

24-Jan-2014
----------------

ముగింపు దశ లో సాయిబాబా ఆలయం
23-Jan-2014
----------------
చాలా వేప చెట్లు ఇలా ఎండిపోతున్నాయి



22-Jan-2014
---------------

జొన్నరొట్టె తో వెన్నపూస తెలవాయికారం అద్దుకుని తింటే ! అబ్బా అదిరిపోతుంది.
21-Jan-2014
---------------
సింహాద్రిపురం నుంచి కసనూరు మరియు కసనూరు నుంచి అగ్రహారం రోడ్డు కు మరమ్మతులు చేశారు. తొందరలో రెండో కోటింగ్ వేస్తారు.


20-Jan-2014
----------------













శనగలు మిషన్ వేయడం ప్రారంభించారు. ఈ ఏడు శనిగ ఎత్తు పెరగకపోవడంతో పొట్ట్ట్త్టు తక్కువగా పడుతోంది. 6 నుంచి 7 క్వింటాళ్ళు అవుతాయి అని అనుకుంటున్నారు అంతా. రైతులంతా కలాల్లొ బిజీగా ఉన్నారు.

19-Jan-2014
---------------

17-Jan-2014
----------------

పల్లెదావ నుంచి కసనూరు వ్యూ
15-Jan-2014
---------------
ఈ సంవత్సరం కొంతమంది నారవల్లో నువ్వులు విత్తారు.


14-Jan-2014
----------------
మొన్న కొండ నుంచి 40 ఆవులు వచ్చాయి. పాల శంకర బడికాడ సుబ్బిరెడ్డి పవనేశ హర్ష ఇంకా కొంత మంది కొన్ని ఆవులను కొండకు తొలొచ్చారు.ఇంకా 10 ఆవుల దాకా అలాగే ఉన్నాయి.

ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బేమ్మ లు పెట్టి పిండి వంటలు చేశారు. సంక్రాంతి అంటే గంగిరెద్దులు హరిదాసుల కొలాహాలం గుర్తోస్తుంది కానీ అవేవీ మన ఉర్ల్లో కనబడలేదు.




 పండగకు చిన్న పెద్ద అంతా వూరికి రావడంతో కసనూరు సందడిగా మారింది. వినోద్ , సందీప్, ఒంప్రకాష్ , మల్లీ, తిమ్మారెడ్డి, విజయ్ కుమార్, విజయ్ వర్ధన్, విష్ణు వర్ధన్, సందీప్, లక్ష్మయ్య, జగదేకర్, హర్ష, సూర్య ప్రదీప్, శివతేజ, ప్రకాష్, సాగర్, శంకర్,చక్రి ఇంకా కొంత మంది కలిసి రెడ్డి కట్ట లో 15 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడారు.

13-Jan-2014
---------------
ఈ రోజు కొంతమంది భోగి మంటలు వేశారు, చిన్న పిల్లలకు రేనగాయలు తల మీద పోసి స్నానం చేయించారు.


11-Jan-2014
---------------
ఈ రోజు వైకుంఠ ఏకాదశి అందువల్ల చెన్నకేశవ గుడి లో వైకుంఠ ద్వారం తెరిచారు భక్తులు టెంకాయలు కొట్టి చెన్నకేశావుణ్ని పూజించారు.

సందులో గోపాల కొడుకు లోకేశ్వర రెడ్డి అంగడి తన ఇంటిలో ప్రారంభించాడు

01-Jan-2014
---------------
బంకు మహేశ జొన్నల మిషను తెచ్చాడు
కావాలంటే 9000515185 కి కాల్ చేయండి

05-Jan-2014
---------------
ఇంకో వారం రోజుల్లో దాదాపు అందరు శనగ పీకించేస్తారు. అలాగే జొన్న సొప్ప పీకడం ప్రారంబించారు. ఈ సంవత్సరం  కూల్లు చాల ఎక్కువగా వున్నాయి. శనగ పీకడానికి 150 సొప్ప పీకడానికి 170 తీసుకున్టున్నారు . ఎకరాకు 5 నుంచి 7 మంది పడుతున్నారు.
02-Jan-2014
---------------
 ఈరోజు  శనగ కట్ట పీకడం మొదలు పెట్టారు. మొదట శేశాడ్డి గారి నాగేశ్ తర్వాత గారిమిద్దోల్లు శనగ పీకించారు .
01-01-2014
---------------
31 వ తేది రాత్రి దాదాపు 30 మంది దాకా గడ్డం సాంబుడు సోంపు దగ్గర పార్టీ చేసుకున్నారు. పిల్లలు పెద్దలు అంతా కలిసి సంతోషం గా గడిపారు. గడ్డం శేకర, పాల రవి, కైలాష్, శివానంద, శివలింగం, ధనుంజయ, బుర్జు గోపాల, బడికాడ గోపాల, పాతింటి రామంజులు, మల్లయ్యగారి రాజ, చంద్రయ్య, సురేష్ (మూగోడు), కుల్లాయప్పలు ఇందులో పాల్గొన్నారు.

తెలుగు వర్షన్

కసనూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ను పురస్కరించుకుని ఈ రోజు నుంచి మన బ్లాగు యందు తెలుగు వర్షన్ ని ప్రవేశ పెట్టడం జరిగింది.