2 Apr 2014

ఏప్రిల్ కబుర్లు

30-Apr-2014
-----------------

హాయ్,
మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మరియు వాహన రెజిస్ట్రేషన్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

29-Apr-2014
-----------------
చిత్రం ఈనాడు పేపర్ నుండి

24-Apr-2014
----------------
R. శివమల్లా రెడ్డి గారి అమ్మ గారు ఈ రోజు రాత్రి కన్ను మూశారు.
23-Apr-2014
----------------
ఒక శుభవార్త. దాదాపు 30 గ్రామాలు ఉన్న సింహాద్రిపురం లో ఎట్టకేలకుతొలి ఏటీయం ని ఏర్పాటు చేశారు. సిండికేట్ బాంకు వారు దీనిని ఏర్పాటు చేశారు.

22-Apr-2014
-----------------
ఈ రోజు తెల్లవారుజామున, 14 వ తేదీ శ్రీశైలం వెళ్ళిన భక్తులు ఊరికి తిరిగి వచ్చారు.

15-Apr-2014
---------------
ఈ రోజు ఆంకాళమ్మ గూడూరు లో తిరుణాల మొదలైంది.
సమాచారం అందిచిన వారు: R.శశికల
14-Apr-2014
----------------
ఈ రోజు దాదాపు 20 మంది దాకా భక్తులు శ్రీశైలం కి పాద యాత్ర చేపట్టారు. శేఖర, రవి, ధను, కుల్లయప్ప, శంకర, శివానంద, జగదీష్ మొదలగు వారు ఇందులో పాల్గొన్నారు.
12-Apr-2014
----------------
11-Apr-2014
----------------
ఈ రోజు మన ఊరి బడి(పాఠశాల) లో జడ్ పి టి సి ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి.
10-Apr-2014
-----------------
ఒక  అశుభ వార్త. ఈ రోజు గారమిద్దె విశ్వనాథ రెడ్డి చిన్న కొడుకు మహేశ్వర రెడ్డి అనారోగ్యం తో చనిపోయాడు. 
08-Apr-2014
----------------
 కసనూరు ప్రజలు ఈ రోజు శ్రీరామనవమి పండుగ ని జరుపుకున్నారు. పానకం పెసర బాల్ళ్లు ప్రసాదం గా స్వీకరించారు. ఉర్లో భజన చేశారు.
01-Apr-2014
---------------
ఈ రోజు ప్రజలంతా పారణ జరుపుకున్నారు. కొంతమంది పెద్దమ్మ కి కోళ్లు సమర్పించారు. రంగప్ప మేకపోతు సమర్పించాడు.