3 Nov 2016

నవంబర్ కబుర్లు

09-Nov-2016
------------------


04-Nov-2016
------------------

03-Nov-2016
------------------



1 Oct 2016

అక్టోబర్ కబుర్లు

24-Oct-2016
------------------

22-Oct-2016
------------------
 
15-Oct-2016
------------------

కొంతమంది రైతులు శనగ విత్తనం వేశారు. యీ సంవత్సరం పదును తక్కువగా ఉంది. సింహాద్రిపురం దావన చాలా మంది విత్తనం వేశారు. 


13-Oct-2016
----------------------


08-Oct-2016
----------------------

07-Oct-2016
------------------

ఎఱ్రన్న గారి శివ శంకర రెడ్డి ఇవాళ ఉదయం హటాన్మరణం చెందారు.

05-Oct-2016
------------------





01-Oct-2016
------------------

1 Sept 2016

సెప్టెంబర్ కబుర్లు

29-Sep-2016
----------------

26-Sep-2016
----------------


08-Sep-2016
----------------

06-Sep-2016
----------------
 ఇవాళ సాయంత్రం కసనూరు లో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. పిల్లలు పెద్దలు రంగుల్లో తేలిపోయారు.
05-Sep-2016
----------------
కసనూరు వినాయకుడు. యీ సంవత్సరం 13 అడుగుల విగ్రహం తెచ్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహం ఒక్కరే తీస్కురావడం ఆనవాయితీ అయింది, యీ ఏడు గుండ్రెడ్డి నారాయణ రెడ్డి తెచ్చారని వినికిడి.




04-Sep-2016
----------------

01-Sep-2016
----------------


25 Aug 2016

ఆగస్ట్ కబుర్లు

31-Aug-2016
---------------



30-Aug-2016
---------------

నిన్న రాత్రి కసనూరులో భారీ వర్షం పడింది. పల్లె వంక బిసగా పారుతోంది. మన ఊరి చెరువుకు చిన్న గండి పడింది. అగ్రహారం వంక కూడా చిన్నగా పారుతోంది. యీ మధ్య కాలంలో ఇంత వర్షం పడలేదు అని రైతులు అంటున్నారు.25-Aug-2016
---------------

గత కొన్ని రోజులుగా మన ఊరిలో గవర్నమెంటు వారు కరెంటు మీటర్లు బిగిస్తున్నారు, ఇంకా మరికొంత మంది సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు

24-Aug-2016
----------------
కొంత మంది రైతుల బాంకు ఖాతాల్లో రుణ మాఫీ డబ్బులు జమ అయ్యాయి

19-Aug-2016
----------------
ఇవాళ మల్లయ్య గారి సాంబశీవా రెడ్డి వివాహం చంద్రిక తో నిడివెళగల లో జరిగినది.

15-Aug-2016
---------------

కసనూరు నుంచి నిడివెళగల కి తారు రోడ్డు వేశారు. నిడివెళగల పెళ్ళిళ్ళకు వెళ్ళాలంటే ఇకమీదట అగ్రహారం వెళ్లాల్సిన అవసరం లేదు.

14-Aug-2016
----------------
ఇవాళ గారమిద్దే ప్రదీప్ కుమార్ రెడ్డి వివాహం ప్రసన్న తో సింహాద్రిపురం లో జరిగింది

05-Aug-2016
----------------
ఇవాళ పుప్పాలా సుదర్శన రెడ్డి గారు ఆరోగ్యం బాగోలేక చనిపోయారు

16 Jul 2016

జులై కబుర్లు

29-Jul-2016
-----------------
గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం మంచి వర్షం పడింది. అగ్రహారం వంక పారుతోంది
24-Jul-2016
-----------------

23-Jul-2016
-----------------

15-Jul-2016
-----------------

18 Jun 2016

జూన్ కబుర్లు

28-Jun-2016
------------------


21-Jun-2016
------------------
గత కొద్ది రోజులుగా ఎండ లేదు మూసుకొని ఉంది అయిన పెద్ద వర్షం పడలేదు

20-Jun-2016
------------------

17-Jun-2016
--------------------

2 May 2016

మే కబుర్లు

25-May-2016
-------------------

24-May-2016
-------------------

ఇవాళ ఆంజనేయ గుడి లో గ్రామ సుభిక్షం కోసం భాగవత పఠనం నిర్వహించారు.

20-May-2016
-------------------

19-May-2016
-------------------

18-May-2016
-------------------

10-May-2016
-------------------
ఇవాళ కసనూరులో ఓ మోస్తరు వర్షం పడింది. దాంతో ఎండలనుంచి కొంత ఉపశమనం లభించింది

07-May-2016
-------------------



02-May-2016
-------------------

5 Apr 2016

ఏప్రిల్ కబుర్లు

23-Apr-2016
-----------------

19-Apr-2016
-----------------
ఆదర్శం


14-Apr-2016
-----------------

13-Apr-2016
-----------------

Oracle Apps Technical 0-2 yrs exp. (Freshers Also but who learnt Orcle Apps Course)
Company: Saankhya Techno Systems Pvt Ltd
Location: Pune

.Net senior
Company: Cosmos E-solutions
Location: Pune


Contact: Jagadekara Reddy, 8600772984

Interested Candidates forward your resumes to jagadekara.reddy@saankhya.com or jagadekar@gmail.com

09-Apr-2016
-----------------



08-Apr-2016
-----------------


07-Apr-2016
-----------------

05-Apr-2016
-----------------

1 Mar 2016

మార్చి కబుర్లు

31-Mar-2016
--------------------



23-Mar-2016
--------------------

22-Mar-2016
--------------------
కరవు కాలుమోపలేని ఇజ్రాయిల్‌..! 
15 ఏళ్ల దుర్భిక్షాన్ని సవాలు చేసిన చిరుదేశం 
ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేక కథనం: దాదాపు 14ఏళ్ల పాటు తీవ్రమైన కరవు.. ఓ వైపు మధ్యదరా సముద్రం ఉన్నా తాగటానికి.. వాడకానికి పనికిరాని ఉప్పునీరు.. ఒక రకంగా దీనికి ఎదురునిలవడం అంటే ప్రకృతిపై పోరాడి గెలవడమే.. ఆ పనే చేసింది ఇజ్రాయిల్‌..!
ఆకాశం నుంచి రాలే ప్రతిబొట్టును ఒడిసి పట్టింది.. వినియోగించిన నీటిని సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్‌ చేసింది.. సముద్రపు నీటిని శుద్ధి చేసింది.. అన్నిటినీ మించి నీటి పొదుపుపై పెద్దఎత్తున అవగాహన కల్పించింది. దీంతో ఇజ్రాయిల్‌ కరవు ప్రభావం చూపని దేశంగా గర్వంగా నిలిచింది.
నాసా అధ్యయనాల ప్రకారం 1998-2012 వరకు మధ్యదరా సముద్రం తూర్పుప్రాంతంలో 900 ఏళ్లలో ఎన్నడూ లేనంత భయంకరమైన కరవు తాండవించింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేశంలో సగం నీరు స్వయంగా తయారు చేసినదే కావడం గమనార్హం. ఫలితంగా అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన 2015 సంవత్సరలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడింది.
2007-08 శీతాకాలంలో వర్షపాతం పూర్తిగా కుంటుపడింది. దీంతో దేశంలోని మూడింట రెండొంతులు సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదైంది. దీంతో నీటిశుద్ధి కార్యక్రమాన్ని ఇజ్రాయిల్‌ వేగవంతం చేసింది. భారీ ఎత్తున సముద్రపు నీటిని శుద్ధిచేయడం ప్రారంభించింది. దేశ ప్రణాళికలో పేర్కొన్న దానికంటే వేగంగా దీనిని చేపట్టింది. దేశంలోని ఐదు నీటి శుద్ధి కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టింది.
ప్రస్తుతం ఈ దేశంలోని టెల్‌అవీవ్‌ వద్ద ఉన్న డీశాలినేషన్‌ ప్లాంట్‌ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది 2013 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచి రోజుకు 164 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని అందజేస్తారు. ఈ ప్లాంట్‌ రివర్స్‌ ఓస్మోసిస్‌ పద్దతిలో పనిచేస్తుంది. నీటి నుంచి తొలగించిన ఉప్పును సురక్షిత పద్ధతిలో తిరిగి సముద్రంలోకి పంపిస్తారు.
పునర్వినియోగంలోనూ..
ఇజ్రాయిల్‌ సముద్రపు నీటిని శుద్ధి చేయడంతో పాటు మురుగునీటిని రీసైక్లింగ్‌ చేయడంపైన కూడా దృష్టిపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవలో మరుగునీటిని శుద్ధి చేయడంలో ఇజ్రాయిల్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 86శాతం మురుగునీటిని రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు ఓఈసీడీ నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఈ దేశంలో నీటి రీసైక్లింగ్‌ చేయని వారు 7.7 శాతం ఉంటే... ఇప్పుడది 2.2 శాతానికి తగ్గింది. వాటర్‌ రీసైక్లింగ్‌పై ప్రజల్లో పెరిగిన అవగాహనకు ఇది నిదర్శనంగా చెప్పొచ్చు.
వినియోగంలో కోత..
నీటిని అత్యధికంగా ఉపయోగించేది వ్యవసాయ రంగమే. ఈ విషయం ఇజ్రాయిల్‌కు బాగా తెలుసు.. అందుకే వ్యవసాయ రంగానికి వినియోగించే నీటిని గణనీయంగా తగ్గించింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ఎత్తున ప్రచారం చేసింది. డ్రిప్‌ ఇరిగేషన్‌ను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. దాదాపు 400 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మురుగునీటిని కూడా వ్యవసాయానికి వాడుకుంటోంది.
నీటి వినియోగంపై ప్రజల్లో నిర్వహించిన భారీ ప్రచారం మంచి ఫలితాన్నిచ్చింది. పట్టణ ప్రాంతాల్లో, గృహాల్లో నీటి వినియోగంలో దాదాపు 18 శాతం ఆదా చేస్తోంది. దీంతో పాటు ప్రజలకు పంపిణీ చేసే నీటి సరఫరాలో సబ్సిడీలను తొలగించింది. దీంతో ప్రజలు నీటి వినియోగాన్ని తగ్గించుకున్నారు. దీనికి తోడు పైపులైన్ల లీకులను అరికట్టడంతో మరో 9 శాతం నీరు ఆదా అయింది.
ఇళ్లలో వినియోగించే షవర్‌ హెడ్స్‌లో మార్పులు చేయడం.. పంపుల నుంచి వెలువడే నీటిధారను తగ్గించడం.. దీనికి తోడు ఇంట్లో ఉపయోగించుకునే పంపులు వంటి వాటిలో గాలి ఒత్తిడిని గణనీయంగా పెంచారు.. ఫలితంగా ఎక్కువ ధార వస్తున్న భావన కలగడంతో పాటు మూడో వంతు నీటిని ఆదా చేయగలిగారు.
ఫలితంగా ఇజ్రాయిల్‌ నేడు సొంతంగా దాదాపు 2 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. వీటితో పాటు చుట్టుపక్కల దేశాలకు దాదాపు 57 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని అందజేస్తోంది. ఫిబ్రవరిలో జోర్డాన్‌, పాలస్తీనాలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి 120 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
దూరదృష్టితో రూపొందించిన చక్కటి ప్రణాళిక.. చిత్తశుద్ధితో కృషి చేసే నాయకులు.. సందర్భాలకు తగినట్లు స్పందించే ప్రభుత్వాలు.. క్రమశిక్షణతో సహకరించే ప్రజలు ఉంటే ఎంతటి కరవునైనా అవలీలగా ఎదుర్కొవచ్చని ఇజ్రాయిల్‌ విజయగాథ మనకు తెలియజేస్తోంది.
సమాచారం: ఈనాడు పత్రిక

18-Mar-2016
-------------------



16-Mar-2016
-------------------



15-Mar-2016
-------------------

08-Mar-2016
-------------------
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

07-Mar-2016
--------------------

02-Mar-2016
------------------