20 Oct 2014

ఇలాంటి వాటి వల్ల హై కోర్ట్ అంటే గౌరవం పెరుగుతుంది.

రైతు రుణమాఫీ సరికాదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల లేకపోతే మనం కూడా లేమని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. అప్పుల బాధతో పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న హైకోర్టు ...ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని పిటిషనర్ ను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరికాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన హైకోర్టు రైతులు లేకపోతే మనం కూడా లేమని కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక దృక్కోణం మారాల్సిన అవసరం ఉందని, కోటీశ్వరులు, సామాన్యులు...సమాన స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల వారు రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందుతారని...చాలామంది వినోదం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ...అలాంటిది పేద రైతులకు రుణమాఫీ అమలు చేస్తే తప్పేంటని న్యాయస్ధానం ప్రశ్నించింది.

18 Oct 2014

తుఫాన్ బాధితుల సహాయార్థం

హాయ్ ఫ్రెండ్స్,

దీపావళి కి టపాసులు కాల్చకుండా ఆ డబ్బులను తుఫాన్ బాధితులకి అందించాలని నా మనవి.

9 Oct 2014

అక్టోబర్ కబుర్లు

25-Oct-2014
----------------



24-Oct-2014
-----------------
ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది. ఈ నెలలో భక్తులంతా ఎంతో నిష్ట తో ఈశ్వరుని పుజిస్తారు. మాంసాహారం తీస్కోరు. కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి ముఖ్యమైన రోజులు.
23-Oct-2014
-----------------


17-Oct-2014
-----------------

12-Oct-2014
-----------------
రైతులకు శుభవార్త. 2011-12 సంవత్సరానికి శనగ పంట కి ఇన్షురెన్స్ వచ్చింది. ఈ నెల 21,22,23 తేదీలలో రైతులకు అందచేస్తారు. ఎకరాకు 5000 రూపాయల చిల్లర ఇవ్వనున్నారు.

09-Oct-2014
---------------
ఇవాళ కూడా కొద్దిపాటి వర్షం పడింది పొద్దున.

08-Oct-2014
----------------


07-Oct-2014
----------------
ఇవాళ పొద్దున పాతపల్లి వాళ్ళు కసనూరికి భజనకి వచ్చారు. వాళ్ళు కూడా 5 ఊర్ల భజన చేపట్టారు. మన ఊర్లో వాళ్ళకి ఉప్మా మరియు ఉగ్గాని పెట్టారు.


06-Oct-2014
----------------
ఈరోజు తెల్లవారుజామున 3.30 కి కొద్దిపాటి వర్షం కురిసింది. కొత్తపల్లి పరిసరాల్లో మరియు శవారిపల్లి, సుంకేశుల, రావులకొలను పరిసరాల్లో మంచి వర్షం పడింది.

05-Oct-2014
----------------

ఈరోజు కసనూరు ప్రజలు భైరేవునికి బోనాలు సమర్పించారు. వర్షం కురవాలని వేడుకుంటూ రెండు యాటలు ఇంకా కొన్ని కోళ్లు సమర్పించారు.










ఫోటోలు  పంపినవారు జగదేకర్.

ఈరోజు కసనూరు లో బీ టెక్ రవి ఇచ్చిన విందుకు పలువురు టిడిపి ప్రముకులు హాజరయ్యారు. మంత్రి రావేల కిశోర్ బాబు, సతీష్ రెడ్డి, సీయం రమేశ్, లింగారెడ్డి ఇంకా కొందరు ప్రముకులు హాజరయ్యారు.
 



04-Oct-2014
----------------
నిన్న మొదలుపెట్టిన భజన ఇవాళ సాయంత్రం అయిపోయింది. అంతటి భారీ ఎండలో కూడా ప్రజలు ఎంతో భక్తి తో భజన కొనసాగించారు.

03-Oct-2014
-----------------
ఈరోజు రాత్రి 8 గంటలకి 5 ఊర్ల భజన ప్రారంభించారు. మన భజన సంఘం కాలినడకన  కడపనాగయ్యపల్లి, దిద్దేకుంట, సుంకేశుల, ముసల్‌రేడ్డిపల్లి మరియు కసనూరు గ్రామాల యందు భజన చేస్తారు. దాదాపు  65 మంది పాల్గొన్నారు. చిన్నయ్యగారి చంద్రుడు,ఆర్. రామకృష్ణ రెడ్డి, గారమిద్దే ప్రసాద్ రెడ్డి, స్టోర్ రాములు, మదనగారి సోమూడు, గడ్డం సాంబుడు, మల్లయ్యగారి రాజా, కుమ్మరాంకాడ రాజా,మధు, మల్లిక, శివారామి రెడ్డి, సుబ్బి రెడ్డి, జగదేకరా, గోపి, ధనుంజాయా రెడ్డి, తిమ్మ రెడ్డి, హర్ష వర్ధం రెడ్డి, బడికడ హర్ష, కండక్టర్ హరి, కుల్లయప్ప, నళ్దిమ్మాగారి ప్రసాద్, చెన్నంపల్లి గంగాధర, కైలాష్, కాటసాని  ప్రతాపుడు, చవ్వా శ్రీరాములు, మాచర్ల, చంద్ర, వీరయ్య, చంద్రాయ్య, మహేష్, బోనాల విజయ సింహ రెడ్డి, సురేష్, జగదీష్,శివానంద ..మొదలగు వారు భజన లో పాల్గొన్నారు.

02-Oct-2014
----------------
దసరా పండుగ సందర్భం గా అందరూ బయట చదువుకుంటున్న ఉద్యోగం చేస్తున్న పిల్లలు పెద్దలు అందరుఊరికి వచ్చారు. పండుగ సందడి కనిపిస్తోంది.