1 Jan 2016

జనవరి విషయాలు

31-Jan-2016
-----------------
రైతులంతా శనగా కట్టే పీకడం, సొప్ప కొయడం లో తీరిక లేకుండా ఉన్నారు.
29-Jan-2016
----------------


26-Jan-2016
--------------------


25-Jan-2016

--------------------


24-Jan-2016

--------------------
రవిశంకర రెడ్డి భార్య అనిత ఇవాళ ఆరోగ్యం బాగాలేక మరణించారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ..


21-Jan-2016

--------------------



20-Jan-2016

--------------------

ఇవాళ తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం వాటిల్లనుంది. ముఖ్యం గా యీ వర్షం శనగా పంటకు తీవ్ర నష్టం.



19-Jan-2016

--------------------

18-Jan-2016
--------------------
రైతులకు శుభవార్త:

పంటకు బీమా చేయిస్తే రైతు కుటుంబానికి, సేద్యానికి వినియోగించే సామగ్రికి సైతం బీమా రక్షణ లభిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ‘ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన’(పీఎంఎఫ్‌బీవై) పథకం మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖలకు తాజాగా పంపింది. కొత్త పథకంలోని నిబంధనలు, పంటలబీమా అమలు చేయాల్సిన తీరును ఇందులో వివరించింది. ఆ ముఖ్యాంశాలు...
ఇంతకాలం పంటబీమాకు కిస్తీ (ప్రీమియం) చెల్లిస్తే పైరు నష్టపోతేనే కొంత పరిహారం వస్తోంది. ఇకనుంచి సదరు పంట సాగుచేసిన రైతు లేదా అతని కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించినా రూ.2 లక్షల దాకా పరిహారం వస్తుంది. ఏదైనా ప్రమాదంలో రెండు కళ్లు పోయినా, ఒక కన్ను లేదా కాలు లేదా చేయి పోయినా ఈ పరిహారం పూర్తిగా ఇస్తారు. రైతుకు 70 ఏళ్ల వయసు వరకే బీమా వర్తిసుంది. రైతు నివసించే ఇంటికి, అందులోని సామగ్రికి సైతం బీమా వర్తించనుంది. ఇది అందాలంటే రైతు పంటరుణం తీసుకునే బ్యాంకులో పొదుపు ఖాతా ఉంటే చాలు. ఏటా రూ.12 చొప్పున కిస్తీ చెల్లించడానికి అంగీకరిస్తూ బ్యాంకుకు లేఖ రాసి ఇవ్వాలి. ఏటా జూన్‌ ఒకటిన ఈ డబ్బులను రైతు ఖాతా నుంచి బ్యాంకులు మినహాయించుకుంటాయి.
వ్యవసాయానికి ఉపయోగించే విద్యుత్తు మోటారు లేదా ట్రాక్టర్‌ కాలినా, ధ్వంసమైనా పరిహారం వస్తుంది. మోటార్లకు ఒకటి నుంచి 10 అశ్వికశక్తి(హెచ్‌పీ) గల వాటి వరకూ బీమా వర్తిసుంది.
వ్యవసాయ ట్రాక్టర్‌ నడుపుతున్నప్పుడు దాని డ్రైవర్‌ మరణించినా అతని కుటుంబానికీ పరిహారం ఇస్తారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘జాతీయ సాధారణ వ్యవసాయ పంటలబీమా’(ఎన్‌ఏఐఎస్‌), ‘సవరించిన జాతీయ సాధారణ వ్యవసాయ పంటలబీమా’(ఎంఎన్‌ఏఐఎస్‌) పథకాలను కలిపేసి కొత్తగా పీఎంఎఫ్‌బీవై పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద ఆహారధాన్యాలు, నూనెగింజల పంటలకు ఖరీఫ్‌లో పంటవిలువపై 2 శాతం, రబీలో 1.5 శాతం సొమ్మును కిస్తీగా జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐఎస్‌) వసూలు చేస్తుంది.
ఏటా ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకూ ఇచ్చే ఖరీఫ్‌ పంటరుణాల నుంచి బ్యాంకులు తప్పనిసరిగా కిస్తీని మినహాయించి ఏఐసీకి పంపాలి. ఇలాగే రబీకైతే అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ ఇచ్చే రుణాలకు మినహాయించాలి.
కొత్త పథకం అమలుతీరును ఏడాది తరవాత రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి మార్పులు చేయవచ్చు.
ప్రస్తుతం మూడు రకాల పంటలబీమా పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఎన్‌ఏఐఎస్‌, ఎంఎన్‌ఏఐఎస్‌, వాతావరణ ఆధారిత పంటలబీమా.
ఇకనుంచి వాతావరణ ఆధారిత పంటలబీమా పథకంలో వాణిజ్య పంటలకు బీమా చేయిస్తే గరిష్ఠంగా 5 శాతం వరకే కిస్తీ వసూలు చేస్తారు. మిగతా సొమ్మును కేంద్రం, రాష్ట్రం చెరిసగం భరించాలి.
గ్రామం యూనిట్‌గా కొత్త పంటబీమా పథకం అమలవుతుంది.
కొత్త పంటబీమా పథకానికి చెల్లించే నిధులపై సేవాపన్ను ఏమీ ఉండదు.
రైతుకు చెందిన ఏ ఖాతా నుంచి బీమాకు కిస్తీ చెల్లించారో అదే ఖాతాకు పరిహారం ఆన్‌లైన్‌లో ఏఐసీ జమచేస్తుంది. ఖాతా వివరాలను స్పష్టంగా తెలపాలి. పంటరుణాలు తీసుకోని రైతులు నేరుగా బ్యాంకులో పంటబీమాకు ప్రీమియం చెల్లించాలి.
పంటనష్టాలను అంచనా వేయడానికి పథకం అమలుకు అనుసరిస్తున్న షరతులను బట్టి పంటకోత ప్రయోగాలు చేపట్టాలి. ఉదాహరణకు ఏదైనా రాష్ట్రం ‘జిల్లా యూనిట్‌’గా ఒక పంటకు బీమా అమలు చేస్తే సదరు జిల్లాలో 24 చోట్ల ‘పంటకోత ప్రయోగాలు’ చేసి దిగుబడిని అంచనా వేయాలి. ఒకవేళ తాలూకా యూనిట్‌గా అమలుచేస్తే 16 పంటకోత ప్రయోగాలు, మండలం యూనిట్‌గా అయితే 10, గ్రామం యూనిట్‌గా అమలుచేస్తే ప్రధాన పంటలకు 4, ఇతర పంటలకు 8 ప్రయోగాలు చేయాలి. ఒక పొలంలో కొద్దిగా నమూనా పంటను కోసి నూర్పిడి చేస్తే వచ్చే దిగుబడిని పంటకోత ప్రయోగంగా పిలుస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీ చర్చించి పంటలు నష్టపోయినప్పుడు వెంటనే రైతుకు 25 శాతం పరిహారం చెల్లించాలి. ఈ నష్టంపై తక్షణ అంచనాకు జీపీఎస్‌ వ్యవస్థలుండే స్మార్ట్‌ఫోన్లు, ఇంకా ఆధునిక పరిజ్ఞానం వాడాలి. ఇందుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
17-Jan-2016
--------------------



15-Jan-2016

--------------------
కసనూరు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
13-Jan-2016
--------------------


12-Jan-2016
-------------------


11-Jan-2016
--------------------

పంటల బీమాకు కొత్త పథకం
పరిహారం చెల్లింపునకు కాల పరిమితి
ప్రీమియం చెల్లింపులో కేంద్రానికీ, రాష్ట్రానికీ సమాన వాటా

ఈనాడు, దిల్లీ: రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఉండేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త తరహా పంటల బీమా పథకానికి కేంద్ర మంత్రిమండలి ఈ నెల 13వ తేదీనాటి సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. సంక్రాంతి కానుకగా ప్రకటించబోతున్న ఈ పథకంలో... నిర్దుష్ట కాలపరిమితి ప్రకారం బీమా మొత్తాలను చెల్లించబోవడం ప్రధానమైన అంశం. దీనికి ‘భారతీయ కృషి బీమా యోజన’ అనే పేరు ఖరారు చేస్తారు.
* పంట రకాలను బట్టి బీమా చేసే మొత్తంలో 1.5% నుంచి 5% వరకు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య పంటలకు 5%; వరి, పప్పుధాన్యాలకైతే 2.5%; నూనె గింజల పంటలకైతే 2%; గోధుమలకు 1.5% చొప్పున ప్రీమియాలను నిర్ణయించనున్నారు.

* ప్రీమియం మొత్తంలో 95 శాతం వరకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి.
* ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే బీమా మొత్తంలో కనీసం 25 శాతాన్ని వెంటనే, అంటే 2 నుంచి 5 రోజుల్లో పరిహారంగా చెల్లిస్తారు.
* పంట నష్టం గురించి బీమా సంస్థలకు తెలియపరిచిన తేదీ నుంచి గరిష్ఠంగా 45 రోజుల్లో మిగిలిన 75% మొత్తాన్ని చెల్లిస్తారు. పంటల నష్టంపై రెవెన్యూ శాఖ ఇచ్చే నివేదికను బీమా సంస్థలు తప్పనిసరిగా పరిగణించాల్సిందే.
* ప్రస్తుత బీమా పథకంలో పంట నష్టాలకు పరిహారం చెల్లింపుపై కాలపరిమితి లేదు.

 * ఆయా పంట ఉత్పత్తుల సగటు ధరపై 150% వరకు మొత్తానికి రైతులు తమ పంటల్ని బీమా చేయించుకోవచ్చు. ప్రస్తుత పథకంలో ఇది 100 శాతంగా ఉంది. బీమా మొత్తాన్ని పెంచడంతో పాటు ప్రీమియాన్ని తగ్గించారు.దేశంలో మూడు వేర్వేరు రకాల పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నా 14 కోట్ల రైతుల్లో 23% మందే వాటిని వినియోగించుకుంటున్నారు. కొత్త పథకం అమల్లోకి వచ్చాక కనీసం 50% మంది రైతులు ఈ ప్రయోజనాన్ని పొందుతారని ప్రభుత్వ అంచనా.


08-Jan-2016
--------------------

06-Jan-2016
--------------------


06-Jan-2016
--------------------
ఇవాళ సాయంత్రం నాగుల మాను కొమ్మ ఉన్నట్టుండి విరిగి పడింది. యీ మధ్యే ఒక కొమ్మ విరిగి పడింది. ఇప్పుడు చెట్టు కాండం మాత్రమే మిగిలింది. మన ఊర్లో ఉన్న పాతకాలం చెట్లలో నాగులామాను ఒకటి. దీనికి దాదాపు 500 సంవత్సరాల వయసు ఉండవచ్చు.

05-Jan-2016
--------------------


04-Jan-2016
--------------------

02-Jan-2016
--------------------

01-Jan-2016
--------------------


కసనూరు ప్రజలకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.
ఈ కొత్త సంవత్సరం లో అందరికి మంచి జరగాలని కోరుకోంటూ....