29 Jan 2015

కసనూర్ ఎద్డుల పందాలు వీడియో

 

వీడియోలు పంపిన వారు:: K.B. శివ శంకర రెడ్డి



మీరు దీనిని యౌటుబ్ నందు కూడా చూడవచ్చు. ఇక్కడ క్లిక్ ఇవ్వండి. http://youtu.be/xqhPla-EXeo
మీరు దీనిని యౌటుబ్ నందు కూడా చూడవచ్చు. ఇక్కడ క్లిక్ ఇవ్వండి. https://www.youtube.com/watch?v=2u-Q1JaQgtM&feature=youtu.be


వీడియోలు పంపిన వారు: జగదేకరా

6 Jan 2015

జనవరి కబుర్లు

30-Jan-2015
-----------------
ఇవాళ మారిడ్డోల్ల శంకర కూతురు తేజ వివాహం జరిగింది.
27-Jan-2015
------------------
ఇవాళ అన్ని బొరింగులు తయారు చేశారు.



26-Jan-2015
------------------

ఈరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎద్డుల పందాలు జరిగాయి. కడప జిల్లా వల్ళూర్ మండలం(పుత్తా వాళ్ళవి) నుండి వచ్చిన జత మొదటి బహుమతి రూ. 100000/- గెల్చుకుంది. ఈ పోటీలలో దాదాపు 14 జతల ఎద్డులు పాల్గొన్నాయి. అందులో ఎక్కువ కడప జిల్లా నుంచే వచ్చాయి. మొదటి బహుమతి గెలిచిన జత ఆ సోగని 15 నిమిసాలలొ 3550 అడుగుల దూరం లాగింది. రెండో స్థానం లో నిలిచిన జత ప్రకాశం జిల్లా కి చెందినవి. అవి 15 నిమిసాలలొ 3269 అడుగుల దూరం లాగింది.
ఈరోజు ఆడవారికి ప్రత్యేక స్థలం కేటాయించారు. ఈ పోటీల ప్రాంతం మొత్తం జాతర ని తలపించింది.

ఈ మూడు రోజులు కసనూరు లో పండగ వాతావరణం నెలకొంది. మారెడ్డి కుటుంబం ని అబీనందించతగ్గ రీతి లో అంగరంగా వైభవం గా ఈ సాయి బాబా విగ్రహ ప్రతిష్ట వేడుకను నిర్వహించారు. ఈ మూడు రోజులలో దాదాపు 17 వేల మందికి సరిపడా బోజన వసతి కల్పించారు. ఎద్డుల పోటీలకు ప్రత్యేకం గా ఒక చేను ని నీరు పట్టి రోడ్ రోలర్ తో తిప్పి తయారు చేశారు. గుడి కి ఊర్లో చందాలు వసూలు చేశారు. ఆది దాదాపు 80 వేల రూపాయలు వచ్చింది.

దీనికి సంబందించి కొన్ని  వీడియోలు త్వరలో అప్‌లోడ్ చేస్తాం.







గత నాలుగు రోజులుగా కోలాయి నీరు రావడం లేదు.
కొలిమాను కాడ మరియు రాయిమాను కాడ మరియి చిన్న బురుజు దగ్గర ఉన్న బొరింగులు పనిచేయక పోవడం తో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాలలో మన సర్పంచ్ ట్యాంకర్ తో నీటిని సరఫరా చేశారు.

సమాచారం ఇచ్చిన వారు: జగదేకరా రెడ్డి.
ఇంకా మీదగ్గర ఏమైనా ఫోటోలు వీడియోలు ఉంటే kasanuryouth@gmail.com కి పంపమని కోరుతున్నాము.
25-Jan-2015
------------------

ఈరోజు నందీష్ వాళ్ళన్న శివయ్య గారి జగదీశ్వర రెడ్డి వివాహం భానుకోటలో జరిగింది.

ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎద్డుల పందాలు జరిగాయి. కర్నూల్ జిల్లా నుండి వచ్చిన జత మొదటి బహుమతి రూ. 50000/- గెల్చుకుంది. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. మొత్తం 14 కాడ్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి.





 24-Jan-2015
------------------

ఇవాళ మన ఊరి సాయిబాబా ఆలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రజలంతా భక్తి తో పాల్గొన్నారు.



23-Jan-2015
-----------------



ఫోటోలు పంపినవారు: శివతేజ

15-Jan-2015
------------------
ఈ రోజు కసనూరు ప్రజలు మకర సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఈ సంవత్సరం కరువు వల్ల పంటలు బాగా పండకపోవడంతో రైతుల మొహాలలో సంతోషం తక్కువగా కనిపించింది.
15-Jan-2015
---------------
మన కేంద్ర ప్రభుత్వం త్వరలో Soil Health Card  పథకం  ప్రవేశపెట్టనుంది. దీనివల్ల రైతులకు తమ భూమి సామర్థ్యం తెలుస్తుంది. దానిని బట్టి అవసరమైన ఎరువులు మాత్రమే వాడుకోవచ్చు. పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

14-Jan-2015
---------------
హాయ్ ఫ్రెండ్స్,

ఈ మధ్య ఎవరు చూసినా వాట్సాప్ అంటూ తెగ కాలక్షేపం చేస్తున్నారు. మరి మీరు?

చాలా మంది వాట్సాప్ వాడాలంటే స్మార్ట్ ఫోను ఉండాలి అనుకుంటారు. కానీ మీరు మీ పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ నుండి కూడా వాట్సాప్ ని ఉపయోగించవచ్చు.  http://www.bluestacks.com/ లో ఆ సాఫ్ట్ వేర్ ని డౌన్‌లోడ్ చేసుకుని మీరు వాట్సాప్ ఇంకా మొబైల్ గేమ్స్ ఆడుకోవచ్చు.
13-Jan-2015
----------------
12-Jan-2015
----------------


06-Jan-2015
----------------
 ఈరోజు తో మన బ్లాగు నందు తెలుగు వర్షన్ ప్రవేశపెట్టి ఒక సంవత్సరం పూర్తి అయింది. ఈ సంవత్సర కాలం లో మన తెలుగు బ్లాగు ని భారత దేశం తో పాటు వివిద దేశాల ప్రజలు దాదాపు 2050 సార్లు వీక్షించారు.

05-Jan-2015
----------------

01-Jan-2015
----------------

నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ఇవాళ ముక్కోటి ఏకాదశి. మన ఊరి చెన్నకేశవ ఆలయం లో వైకుంట ద్వారం(ఉత్తరం పక్క ఉన్న ద్వారం) తెరవడం జరిగింది. భక్తులు ఈ పార్వ దినాన ఆ ద్వారం నుండి గుడి లోనికి వెళ్ళడం జరిగింది, దాని వల్ల ఎంతో పుణ్యం వస్తుందని వారి నమ్మకం.

నిన్న రాత్రి  రాత్రి దాదాపు 50 మంది దాకా గడ్డం సాంబుడు సోంపు దగ్గర  మరియు ఇంకా వివిధ ప్రాంతాలలో పార్టీ చేసుకున్నారు. పిల్లలు పెద్దలు అంతా కలిసి సంతోషం గా గడిపారు. 2014 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు.