2 May 2014

మే కబుర్లు

30-May-2014
------------------


29-May-2014
-----------------
ఈరోజు మన ఆటగాళ్లు కోరగుంటపల్లి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. కోరగుంటపల్లి జూనియర్స్ టీమ్ తో వోడిపోయారు. మన వాళ్ళు మునుపెన్నడూ బైస్ లతో ఆడలేదు. అందువల్ల తీరకాసు పడి దాదాపు ఆరు మంది రన్ ఔట్ అయ్యారు.
గమ్మత్తు ఏంటంటే ఇదే రోజు కోరగుంటపల్లి సీనియర్స్ టీమ్ తో గెలిచారు. ఏమంటే ఆ మ్యాచ్ టోర్నమెంట్ మ్యాచ్ కాదు. 4000 పందెం గెలిచారు.

సమాచార కర్త: S. చంద్రశేఖర రెడ్డి.

28-May-2014
------------------

 నీళ్ళున్నమన రైతులు కూరగాయలు పండిస్తే కనీసం మన ఊర్లో అయినా ధరలను అదుపు చేయవచ్చు.
27-May-2014
-----------------



25-May-2014
------------------


21-May-2014
------------------
19-May-2014
------------------
మన ఊరి యువకులు ఈమధ్య క్రికెట్టు బాగా ఆడుతున్నారు.  సుంకేశుల, రావులకొలను, ముసల్‌రేడ్డిపల్లి మరియు ఆంకాళమ్మ గూడూరు లతో మ్యాచ్ లు గెలిచారు. మన జట్టు: కొంతమంది దిద్దేకుంట పిల్లోల్ళు మన ఆర్.వినోద్, శివలింగం, చంద్ర శేఖర్, వీర నగేష్, జగదీష్ ..... ఇంకా కొంతమంది.

సమాచార కర్త: జగదేకర
18-May-2014
------------------

17-May-2014
------------------
ఈరోజు కొద్దిగా వాన పడింది.
16-May-2014
------------------
టిడిపి గవర్నమెంటు వచ్చినందుకు మన ఊరి టిడిపి నాయకులు టపాసులు కాల్చారు
ఇంకా సింహాద్రిపురం లో కేక్స్ కట్ చేశారు.



15-May-2014
---------------------

పుప్పాల నరసింహారెడ్డి కూతురు సుప్రజ  10 వ తరగతి లో 9.7 పాయింట్లు సాధించి మన ఊర్లో అగ్ర స్థానం లో నిలిచింది. ఆమె హాల్ టికెట్ నంబరు 1422122610
అలాగే ఇంకా దిలీప్, ప్రశాంత్  ఇంకా కావ్య, శివ లకు కూడా 9 పైనే పాయింట్లు వచ్చాయి. వీళ్ళందరికీ కసనూర్ యూత్ తరపున అభినందనలు.
సమాచారం అందించిన వారు: శివశంకర రెడ్డి మరియు శశికళ.

15-May-2014
------------------

ఈ రోజు S. సాంబశీవా రెడ్డి (గుర్జాల సాంబుడు) కూతురు హిమబింధు వివాహం ప్రొద్డటూరు లో జరిగింది.

14-May-2014
-----------------


12-May-2014
------------------



 సిండికేట్ బాంక్ వారు ఈ మధ్యనే ఏటీయం ని ఏర్పాటు చేసినారు కదా ఆ మిషను ఇంకా బాంకు లోనే ఉంది. అందువల్ల వినియోగదారులు ఆదివారం డబ్బు డ్రా చేసుకోవడం కుదరదు. ఏటీయం కోసం కట్టిన గదిని ఇంకా ప్రారంభించలేదు.
 

11-May-2014
-----------------
ఈ రోజు చిన్న కొండారెడ్డి గారి నరసింహ రెడ్డి వివాహం నిడివెళగల లో జరిగింది. 
11-May-2014
-----------------

08-May-2014
------------------

07-May-2014
-----------------

ఇవాళ మన ఊరిలో వోటింగ్ ప్రశాంతం గా ముగిసింది. దాదాపు 70 శాతం మంది వోటు వేశారు. చాలామంది మధ్యాహ్నం లోపలే వోటు వేశారు. వొంటిగంట తర్వాత క్యూ తక్కువగా ఉండడాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ ఫోటోలు ఆర్ రవిచంద్రా రెడ్డి తీసినవి.

03-May-2014
----------------
ఈ రోజు గారమిద్దే సోమి రెడ్డి గారు మరణించారు. ఈయన విశ్వనాథ రెడ్డి,శివ శంకర రెడ్డి, శివ ప్రసాదు రెడ్డి మరియు సోమేశ్వర రెడ్డి ల తండ్రి.


02-May-2014
-----------------
 మా చెడ్డ "ఒత్తిడి".. వదిలించుకనేదెట్లా...?
మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై ఆధారపడే కన్నా సహజసిద్ధంగా ఎలా నివారించుకోవచ్చో ఒకసారి చూద్దాం...!!

సుధీర్ఘ శ్వాస - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు 10 నిమిషాల పాటు సుధీర్ఘ శ్వాసను తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వ్యాయామాన్ని పాటిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది.

వ్యాయామం - వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం, సైక్లింగ్, జిమ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోవడంతో పాటు, ఆరోగ్యం, చక్కని శరీరాకృతి లభిస్తాయి.

ఆరోగ్యమైన తిండి - సరైన తిండి తీసుకోకపోవడం వల్ల ఒత్తిడి తలెత్తుతుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, సలాడ్‌లు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. అధిక ఫ్యాట్, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.

హాయిగా నిద్రపోండి - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. కానీ సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అటు ఎక్కువగా.. ఇటు తక్కువగా కాకుండా.. రోజుకు ఎనిమిది గంటలపాటు నిద్రిస్తే ఒత్తిడి దూరమవుతుంది. వీలైనంత వరకూ పగటిపూట నిద్రకు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువగా నిద్రపోవడం వల్ల శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి నిద్ర విషయంలో సరైన మెలకువలు పాటిస్తే.. ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.

కోరికలు - మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు సినిమాకు వెళ్లడం, స్నేహితులను కలుసుకోవడం, మీకు ఇష్టమైన పుస్తకాలను చదుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేయడం కూడా మంచి ఫలితాలనిస్తాయి.
01-May-2014
-----------------
దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?
పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు.


ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుందట. అలా జరిగినపుడు ఆహారం బాగా వంటబడుతుందని చెపుతున్నారు.


చాలా మంది పిల్లలకు టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఆహారం వంటబట్టదని అనేక తాజా సర్వేలు కూడా వెల్లడించాయి. వారి దృష్టి ఆహారం మీద కాకుండా, టీవీపైనే కేంద్రీకృతమై ఉంటుందని అందువల్లే భోజనం చేసే సమయంలో దిక్కులు చూడకుండా తినాలని మన పెద్దలు చెప్పేవారట.