20 Oct 2014

ఇలాంటి వాటి వల్ల హై కోర్ట్ అంటే గౌరవం పెరుగుతుంది.

రైతు రుణమాఫీ సరికాదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల లేకపోతే మనం కూడా లేమని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. అప్పుల బాధతో పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న హైకోర్టు ...ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని పిటిషనర్ ను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరికాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన హైకోర్టు రైతులు లేకపోతే మనం కూడా లేమని కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక దృక్కోణం మారాల్సిన అవసరం ఉందని, కోటీశ్వరులు, సామాన్యులు...సమాన స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల వారు రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందుతారని...చాలామంది వినోదం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ...అలాంటిది పేద రైతులకు రుణమాఫీ అమలు చేస్తే తప్పేంటని న్యాయస్ధానం ప్రశ్నించింది.

No comments:

Post a Comment